PDPL: వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం అవుతుందని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందన్నారు. పంటా అవశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గుతుందన్నారు.