T20 WCలో టీమిండియా ఆటను పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ పదే పదే విమర్శించడంపై మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. USA పార్ట్ టైమ్ ప్లేయర్లను చూసి కూడా ఆమిర్ భయపడిపోయాడని, 2024 T20 WC మ్యాచ్ సూపర్ ఓవర్లో ఏకంగా 18 రన్స్ ఇచ్చి పాక్ ఓడిపోయేలా చేశాడని కైఫ్ గుర్తుచేశాడు. అప్పుడు ఒత్తిడితో వైడ్లు వేసిన అతను.. వార్తల్లో నిలవడానికే ఇప్పుడు మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.