ELR: ద్వారకతిరుమల మండలం దేవినేనివారిగూడెం ప్రధాన రహదారికి ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, మండల టీడీపీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ పనులను ప్రారంభించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.