VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 క్యాలండర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. వాటిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ పి.గోవిందరాజులు, వివిధ శాఖల అధికారులు అత్యధికంగా పాల్గొన్నారు.