టీమిండియాతో సెమీఫైనల్లో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ‘X’ వేదికగా ట్వీట్ చేశాడు. దీనిపై భారత నెటిజన్లు.. ఇంగ్లండ్ జట్టు తమ కిట్ బ్యాగులు ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్లడం ఖాయమని కౌంటర్లు ఇస్తున్నారు. భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.