ముంబై వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. T20 WC సెమీస్‌లో ఈ జట్లు ఇప్పటివరకు 2 సార్లు తలపడ్డాయి. 2022లో ENG, 2024లో IND విజేతలుగా నిలిచాయి. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ సెమీస్‌లో గెలిచిన జట్టే విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.