ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచ వ్యాప్త పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడంతో పాటు కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి పోర్టులు, ఎయిర్ పోర్టులు మూసివేత ప్రధాన కారణమని తెలుస్తోంది. స్థానిక మార్కెట్ ఎగ్ ధర రూ. 3.30కి పడిపోయింది.