GNTR: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పలు కీలక డిమాండ్లు చేశారు. గుంటూరు మున్సిపాలిటీలో నిలిచిపోయిన రూ. 360 కోట్ల పీడీ అకౌంట్ నిధులను వెంటనే విడుదల చేసి, మెయింటెనెన్స్ పనులు చేపట్టాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంతో పాటు, గుంటూరు ఆటోనగర్‌లోని వేలాది మంది కార్మికుల కోసం అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.