NRPT: గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మాగనూరు ఎస్సై అశోక్ బాబు నూతన సర్పంచులకు సూచించారు. గురువారం మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సర్పంచులకు శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల గ్రామాల్లోని దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రతి దేవాలయం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.