BHPL: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో శనివారం MLA గండ్ర సత్యనారాయణ రావు విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. అనంతరం BHPL జిల్లాలో నిర్వహించే అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.