W.G: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు, జైలు శిక్ష భారీ జరిమానాలు విధిస్తామని నరసాపురం DSP డా. జి.శ్రీవేద హెచ్చరించారు. శుక్రవారం నరసాపురంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మొదటిసారి పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.