E.G: పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.