సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తొలి 2 మ్యాచుల్లోనూ పరుగుల వరద పారింది. ఇవాళ మూడో వన్డేకు ఆతిథ్యమిస్తున్న విశాఖలోనూ పరిస్థితి భిన్నంగా ఉండకపోవచ్చు. బ్యాటర్లకు అనుకూలించే విశాఖ పిచ్‌పై ఇప్పటివరకు జరిగిన 10 వన్డేల్లో 2 సార్లు 350+ నమోదైంది. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచులోనూ భారీ స్కోర్ నమోదవ్వొచ్చు. మంచు ప్రభావంతో పిచ్ ఛేజింగ్‌కి అనుకూలించే అవకాశముంది.