నంద్యాల మీదుగా ప్రయాణిస్తున్న కొండవీడు రైలు వేళల్లో మార్పులు చేయనున్నారు. ఈ రైలు గతంలో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 1:15 నిమిషాలకు బయలుదేరేది. ఇకపై మధ్యాహ్నం 12: 45 నిమిషాలకు వెళ్తుంది. నంద్యాలకు రాత్రి 8 గంటలకు, అలాగే విజయవాడకు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుంది. ఈ మార్పులు నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.