సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న అయ్యప్పస్వామి గుడి సమీపంలో విద్యుత్ పోల్ రోడ్డుకు అడ్డంగా ఉండేది. సమస్యను మండల ఏఈ పరమేశ్వరరెడ్డి దృష్టికి అయ్యప్ప స్వాములు తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఏఈ పరమేశ్వరరెడ్డి ఆదేశాలతో లైన్ మ్యాన్ సూరి, రామకృష్ణ శనివారం విద్యుత్ పోల్‌ను మార్చారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు కృతఙ్ఞతలు తెలిపారు.