VZM: వినయం,విధేయత, సత్య పూర్వకమైన ఆలోచన మనిషికి అసలైన అబారణాలు అని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆభరణాల లాంటి విద్యను అందించేది ప్రభుత్వ పాఠశాలల అని మంత్రి తెలిపారు. గజపతి నగరంలోని ప్రభుత్వ విద్యాలయాల సముదాయంలో సర్వ శిక్ష అభియాన్ ఏపిసి రామారావు అధ్యక్షత మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.