నేషనల్ మజ్దాూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను నేతలు శుక్రవారం కలిశారు. స్టీల్ సిటీ డిపోను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మెమొరాండం సమర్పించారు.డిపో తరలింపు విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో 98 రోజులుగా కార్మికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షల విషయాన్ని నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లరు.