WGL: నెక్కొండ మండలం చంద్రుగొండ శివారులో శనివారం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకెళ్తున్న రూ.4.38 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.