ATP: జిల్లాలో ఇవాళ, రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పర్యటించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. శనివారం ఉదయం 7.50కు విజయవాడ నుంచి బయలుదేరి 9.35కు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా అనంతపురం కలెక్టరేట్‌కు 11.45 గంటలకు చేరుకుంటారని పేర్కొన్నారు. అధికారులు పర్యటన ఏర్పాట్లు పూర్తి చేశారు.