పాన్‌మసాలా తయారీకి వినియోగించే యంత్రాలు, పరికరాలపై సెస్ విధింపునకు అనుమతించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ద్వారా వసూలయ్యే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పాన్‌మసాలపై ఇప్పటికే 40శాతం GST విధిస్తున్నారు. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది.