W.G: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నడపాలనే మా నినాదమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు రాజీవ్ గాంధీ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ శిబిరంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం కాకుండా ఉంచాలనే ఉద్దేశ్యంతో కోటి సంతకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.