‘టీమిండియాలో సుందర్ రోల్ ఏంటి?’ ఎవరి దగ్గర సమాధానం లేని ప్రశ్న. 3 ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు కానీ రాణించట్లేదు. పైగా ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో, బౌలింగ్ వేస్తాడో లేదో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో అతని పాత్రపై అసిస్టెంట్ కోచ్ డెస్కాటే మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ ఆల్రౌండర్గానే అతణ్ని తీసుకుంటున్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఆట నేర్చుకుంటున్నాడు’ అని తెలిపాడు.