ELR: దెందులూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు మాజీ MLA కొఠారి అబ్బయ్య చౌదరి తెలిపారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం వైసీపీ క్యాంపు కార్యాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయకులు పాల్గొంటారని అన్నారు. కావున సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.