సత్యసాయి: మడకశిర పట్టణంలోని కర్ణాటక బ్యాంక్ బ్రాంచ్ 49వ వార్షికోత్సవ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మడకశిరలో ప్రజలకు సేవలందిస్తున్న బ్యాంకు కార్యకలాపాలను గుర్తిస్తూ కార్యక్రమం సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.