ADB: నేటితో సోయాబీన్ కొనుగోలు పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంటర్ ఇన్ఛార్జ్ నాగభూషణం శనివారం తెలియజేశారు. రైతులు సమయానికి పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు. నాణ్యత లోపించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయమన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.