PLD: విద్యుత్ లైన్ల, ఫీడర్ల మరమ్మతుల కారణంగా ఇవాళ చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ అశోక్ తెలిపారు. కృష్ణారెడ్డి దొంక, కుమ్మరి కాలనీ, నరసరావుపేట సెంటర్ నుంచి ఏఎంజీ వరకు, గణపవరం దొంక ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.