NRPT: చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో నవంబర్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన గోవర్ధన్ రెడ్డి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఆర్థిక సమస్యలు, మతిస్థిమితం లేమి కారణంగా ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓ బావి పక్కన ఉన్న పొదల్లో ఆయన శవం లభ్యం కాగా, కుటుంబ సభ్యులు దుస్తుల ఆధారంగా గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.