KDP: సింహాద్రిపురం మండలం బలపనూరులో శుక్రవారం రైతు నాగేశ్వర రెడ్డి అప్పుల బాధతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన 2 ఎకరాల పొలంలో పంటలు పండకపోవడంతో అప్పులు చేసి, అధిక వడ్డీలతో సతమతమవుతున్నాడు. మరోవైపు, భార్య అనారోగ్యంతో బెంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మనస్థాపంతోనే ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.