GNTR: గుంటూరులోని సిద్దార్థనగర్ 11KV టవర్ లైన్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ఎన్. గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నవభారత్ నగర్ మెయిన్ రోడ్డు, సాయిబాబా రోడ్డు, కల్యాణి నగర్, రత్నగిరి నగర్, గుజ్జనగుండ్ల, ఉద్యోగనగర్, గుర్రాల వారి వీధిలో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.