TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. 3వ విడతలో జరగాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ వేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేసిన ఈ స్థానానికి అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.