‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ పాటపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ చిరుకి థ్యాంక్యూ చెప్పాడు. ‘ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. తీవ్ర జ్వరం ఉన్న చరణ్ ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేశాడు. షూటింగ్ ఆపేద్దామని చెప్పిన ఆయన వినలేదు. ఆ డెడికేషన్, ఆ ఆటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే’ అంటూ రీట్వీట్ చేశాడు.