‘ది కేరళ స్టోరీ’ చిత్ర టైటిల్ను మార్చాలంటూ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. కేరళ పేరు వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఒక రిటైర్డ్ టీచర్, మహిళా లాయర్ ఈ పిటిషన్ వేశారు. ఇది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రచారమని పేర్కొన్నారు. సినిమా విడుదల తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.