SRPT: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులను సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల నాయకులు నల్లగొండ నాగయ్య, డేగల వెంకటకృష్ణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో అమెరికా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద కాంక్షతో అగ్రరాజ్యం అమాయక పౌరులను బలితీసుకోవడం దారుణమన్నారు.