ATP: వేసవి తీవ్రత దృష్ట్యా అనంతపురంలో మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. పరిమాణం, డిజైన్‌ను బట్టి ఒక్కో కుండ 30 నుంచి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గొంతు సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు సహజ సిద్ధమైన చల్లదనం కోసం ఫ్రిజ్‌ల నుంచి మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు.