అన్నమయ్య: రాయచోటిలోని ఎన్జీవో హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కొనండి– మీ ఓటు భద్రం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓటరు సవరణలో అర్హులైన వారికి కూడా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ఆయుధం ఎస్.ఐ.ఆర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.