ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్రపై గతంలో విధించిన సస్పెన్షన్ను వైసీపీ కేంద్ర కార్యాలయం ఎత్తివేసింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నిర్ణయంతో జయం ఫణీంద్ర తిరిగి తన పార్టీ బాధ్యతలను కొనసాగించనున్నారు.