E.G: ప్రధానమంత్రి సూర్య ఘర్-ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం కోరుకొండలోని ఆదిత్య ఫంక్షన్ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సోలార్ రూఫెప్కు 3KW వరకు గరిష్ఠంగా రూ. 78వేల సబ్సిడీ, మిగిలిన మొత్తానికి పూచీకత్తు లేకుండా రుణాలు లభిస్తాయని వివరించారు.