ATP: అనంతపురంలోని శిశుగృహ కేంద్రంలో ఖాళీగా ఉన్న 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి తెలిపారు. మేనేజర్, సోషల్ వర్కర్, నర్సు, డాక్టర్, ఆయా, చాకీదార్ వంటి పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన కేవలం మహిళలతో భర్తీ చేస్తామని చెప్పారు. అర్హులు ఈ నెల 8 నుంచి 14వ తేదీలోపు దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలని కోరారు.