NGKL: టీజీయూటీఎఫ్ (TGUTC) ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దేవసహాయాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించాలని, పోలింగ్ అనంతరం రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని వారు కోరారు.