KNR: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళిపై తిమ్మాపూర్ మండలంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. పోరండ్లలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఓటరు నియమావళిని తప్పక పాటించాలన్నారు.