సత్యసాయి: తలుపుల మండలంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. కుర్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలు స్వీకరించనున్నారు. వచ్చే వారు తమ సమస్యను అర్జీ రూపంలో రాసుకొని, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, సంబంధిత పత్రాలు జతచేసి రావాలని సూచించారు.