అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 31లోపు USను స్వతంత్రంగా వీడితే ఇచ్చే బోనస్‌ను మూడు రెట్లు పెంచింది. ఇంతకుముందు ఈ బోనస్ 1000 డాలర్లు ఉండగా, ఇప్పుడు దానిని 3వేల డాలర్లకు పెంచింది. అలాగే, స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించింది.