నారాయణపేట జిల్లా మక్తల్ గడ్డపై మంత్రి వాకిటి శ్రీహరి తెల్లవారుజామున బైక్పై తిరిగి ప్రజలతో ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, అధికారులను ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు. డ్రైనేజీ సమస్యలు, రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.