కృష్ణా: గన్నవరం మండలం దావజీగూడెం గ్రామంలోని హరిజనవాడలో ఉన్న సీ.యస్.ఐ. చర్చి వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, స్థానిక క్రైస్తవ సోదర–సోదరీమణులకు చర్చి వార్షికోత్సవ, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.