Student Visa : భారత్లో ప్రారంభం అయిన యూఎస్ స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ
అమెరికాలో విద్యను అభ్యసించడానికి స్టూడెంట్ వీసాల జారీ భారత దేశ వ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రారంభం అయింది. గత రికార్డులను తిరగరాస్తూ ఈ ఏడాది వీసాల జారీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
US Student Visa India : నానాటికీ అమెరికా వెళ్లి చదువుకోవాలని ఆశించే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందుకు తగినట్లుగానే అగ్రరాజ్యం అమెరికా కూడా భారతీయులకు పెద్ద ఎత్తున వీసాలు జారీ చేస్తూ వస్తోంది. ఏ ఏడాది గురువారం నుంచి ఈ స్టూడెంట్ వీసాల(STUDENT VISA) జారీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే నాలుగు వేల మందిని ఇంటర్వ్యూ చేసినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక కాన్సులేట్ జనరల్ సయ్యద్ ముజ్తంబా అంద్రాబీ తెలిపారు.
2023లో దేశ వ్యప్తంగా మొత్తం లక్షా నలభై వేల మంది విద్యార్థులకు(STUDENTS) స్టూడెంట్ వీసాలను(STUDENT VISA) జారీ చేశారు. ఈ ఏడాది కూడా అదే మొత్తంలో లేదా అంతకంటే ఎక్కువగా వీసాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 2018, 2019, 2020ల్లో మూడు సంవత్సరాలకు కలిపి ఎన్ని వీసాలు జారీ చేశారో అంతకంటే ఎక్కువగా 2023లో స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది కంటే అంతకంటే ఎక్కువగానే వీసాలు జారీ అవుతాయని తెలుస్తోంది.
మన దేశ(INDIA) వ్యాప్తంగా దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాదుల్లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ గురువారం షురూ అయ్యింది. మరి కొన్ని రోజుల పాటు ఇది కొనసాగనుంది. దీంతో యూఎస్ ఎంబసీ ఆఫీసుల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. అమెరికాలో ఉన్న మొత్తం 4,500 అక్రిడేటెడ్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఈ వీసాలు జారీ కానున్నాయి.