SKLM: పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన జీ. నాగేశ్ (30) మృతిచెందాడు. విజయవాడ నుంచి లగేజీ వ్యాన్లో టెక్కలి వైపు వస్తుండగా రోడ్డుపక్కన వాహనం ఆపి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.