KNR: రాష్ట్రంలోని 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్య మహిళల కోసం ప్రభుత్వం ‘రాత్రి బడులు’ ప్రారంభించింది. సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లో ఇంటర్, డిగ్రీ చదువుకున్న వారిని వాలంటీర్లుగా నియమించి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,96,630 మంది నిరక్షరాస్యులను గుర్తించగా.. ఈసారి ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు సైతం పెరిగాయని అన్నారు.