జపాన్లో భారీ బ్లూఫిన్ ట్యూనా అనే చేప లభ్యమైంది. టోక్యోలోని తొయోసు చేపల మార్కెట్లో 243 కిలోలు ఉన్న ఈ చేపకు వేలం పాట నిర్వహించగా భారీ ధర పలికింది. కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కిమురా పాల్గొని.. ఈ చేపను 3.24 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ట్యూనా చేపగా నిలిచింది.