RR: ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి నుంచి షాద్నగర్ వైపు వచ్చే గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాగు దాటలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.