»Lakhimpur Kheri Female Tantrik Killed Three Years Old Girl In The Name Of Healh Treatment Beaten Badly Burn Hands
UP: యూపీలో దారుణం.. దెయ్యం పట్టిందంటూ బాలిక ప్రాణం తీసిన తాంత్రికురాలు
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తాంత్రికురాలు మూడేళ్ల బాలిక ప్రాణం తీసింది. అనారోగ్యంతో ఉన్న బాలికను చికిత్స కోసం తాంత్రికురాలి వద్దకు తీసుకువచ్చారు.
UP: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తాంత్రికురాలు మూడేళ్ల బాలిక ప్రాణం తీసింది. అనారోగ్యంతో ఉన్న బాలికను చికిత్స కోసం తాంత్రికురాలి వద్దకు తీసుకువచ్చారు. చికిత్స పేరుతో బాలికను ముగ్గురు దెయ్యాలు ఆవహించాయని తాంత్రికురాలు తెలిపింది. వాటిని పారిపోయేలా చేసేందుకు బాలికను బలంగా కొట్టడం ప్రారంభించింది. చిన్నారి రెండు అరచేతులను కాల్చివేసింది. దీంతో బాలిక మృతి చెందింది.
ఆ బాలికను రక్షించడంలో కుటుంబ సభ్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాలిక జలుబుతో బాధపడుతుండగా, ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లారు. తాంత్రికురాలు భూతవైద్యం చేయడంతో బాలిక ఆరోగ్యం మరింత దిగజారింది. ఇదే బాలిక మరణానికి కారణమైంది. విషయం రమియాబెహడ్లోని మిజారియా గ్రామానికి చెందినది. సందీప్ మూడేళ్ల కూతురు మహికి జ్వరం వచ్చింది. అప్పుడప్పుడు బాలికకు వణుకు కూడా వచ్చేది. వైద్యుల చేత చికిత్స చేయించారు. కానీ నయం కాలేదు. ఆ తర్వాత బాలికను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. కానీ కుటుంబం తాంత్రికురాలి గురించి విన్నది. బాలికను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లారు.
ఇక్కడ తాంత్రికురాలు మహిని మూడు దెయ్యాలు పట్టుకున్నాయని .. తంత్రమంత్రాన్ని ఉపయోగించి నయం చేస్తానని నమ్మబలికింది. అందుకు రూ.1500 కూడా తీసుకుంది. తాంత్రికురాలు మొదట మహిని కొట్టి, కాలిన కుండతో ఆమె రెండు అరచేతులను కాల్చింది. చిత్రహింసల కారణంగా మహి పరిస్థితి విషమించింది. దీంతో బాలికను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు లక్నోకు తరలించారు. కానీ, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మహిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు.
సమాచారం అందుకున్న రమియాబెహర్ ఎస్ ఐ వీరేంద్ర సింగ్ తోటి పోలీసుల నుంచి విరాళాలు సేకరించి చికిత్స నిమిత్తం లక్నో పంపించారు. ఇక్కడ డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. పోలీసుల నుండి అందిన సహాయం మొత్తం మందుల కోసం మాత్రమే ఉపయోగపడడంతో… కుటుంబ సభ్యులు బాలికను ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం బాలిక చనిపోయింది. మహి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తాంత్రికురాలి పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.